![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1010 లో..... అపర్ణ, స్వాతి బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి నందు వచ్చి.. నానమ్మ మీరేం బాధపడకండి.. అక్క ఎక్కడున్నా నేను తీసుకొని వస్తానని చెప్తుంది. నువ్వు ఇలా ధైర్యం చెప్తుంటే నా కొడుకు ధైర్యం చెప్తునట్లు ఉందని అపర్ణ అంటుంది.
మరొకవైపు ఇందుకి రాజు వాళ్ళు భోజనం తీసుకొని వస్తారు. నాకు ఇంటి ఫుడ్ కావాలని ఇందు అంటుంది. దాంతో సరే అని ఇందుని కిచెన్ లోకి తీసుకొని వెళ్తారు. నువ్వు ఇప్పుడు ఎలా వండాలో చెప్పు.. నేను చేస్తానని రాజు అంటాడు. ఆ తర్వాత రాజుకి వంట రావడం లేదని ఇందు వంట చేస్తుంది.
ఆ తర్వాత నందుకి ఇందు రాజు వాళ్ళ దగ్గర ఉందని ఒక క్లూ దొరుకుతుంది. దాంతో నందు వెంటనే అక్కడికి వెళ్తుంది. ఇందు వాళ్ళతో కలిసి భోజనం చేస్తుంటుంది. అప్పుడే నందు కిటీకిలోనుండి చూస్తుంది. అదేంటీ అక్క వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తుంది. నేను తర్వాత వస్తానని నందు అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వంటలన్నీ బాగున్నాయని లక్కీ పొగుడుతాడు. థాంక్స్ ఇప్పటివరకు నా వంటలకి పేర్లు పెట్టారు కానీ ఇలా ఎవరు చెప్పలేదని ఇందు అంటుంది. ఒరేయ్ రోజు మా ఇంట్లో తింటావ్ కదరా అని రాజు అంటాడు. ఇన్ని వైరటీస్ ఎప్పుడు తినలేదని లక్కి అంటాడు.
మరొకవైపు కోటి రూపాయలు ఎలా ఏర్పాటు చెయ్యాలని రేఖ టెన్షన్ పడుతుంటే.. రేఖ ఇంట్లో ఒక పనిమనిషిని పెట్టు ఆ పోలీస్ వాళ్లకి వండి పెట్టలేక చస్తున్నానని భ్రమరాంబ అంటుంది. ఊరుకో పిన్ని అసలే ఆంటీ టెన్షన్ లో ఉందని ఐశ్వర్య అంటుంది.
అప్పుడే చక్రి ఇంటికి వస్తాడు. అతని దగ్గర కోట్లల్లో రేఖ అప్పు చేసింది. అది అడగడానికి వస్తాడు. ఇప్పుడు మీ పరిస్థితి నాకు తెలుసని చక్రి అనగానే చాలా థాంక్స్ చక్రి మా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు అని భూషణ్ అంటాడు. నేను మీ దగ్గరికి వచ్చింది నా అప్పు కట్టమని అని చక్రి అంటాడు. ఇప్పుడు మాకు కోటి రూపాయలు కావాలని రిక్వెస్ట్ చేస్తారు. దాంతో చక్రి కన్విన్స్ అయి మీ దగ్గరున్న నగలు తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి అంటాడు.
దాంతో అందరి దగ్గర నగలు తీసుకొని వస్తారు. ఇవి అన్నీ కలిపితే యాభై లక్షలు అవుతుందని చక్రి అంటాడు. మిగతా నగలు అన్ని బలవంతంగా అపర్ణ దగ్గర నుండి లాక్కుంటారు. తరువాయి భాగంలో ఇందు దగ్గరికి నందు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |